
ఆ తర్వాత నాలుగు పరుగులు జత చేసి రాహుల్ (22) కూడా చేతులెత్తేశాడు, అలా కష్టాల్లో ఉన్న టీం ఇండియాను ఆదుకోవలసిన బాధ్యత అంతా కోహ్లీ మరియు పుజారాలపై పడింది. కానీ కోహ్లీ సైతం కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఆ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కీపర్ పంత్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు... వేగంగా ఆడి జట్టును ఆదుకోవాలని ప్రయత్నించిన పంత్ (46) కూడా అవుట్ అయ్యాడు. ఇక అప్పటి నుండి పుజారాతో జత కలిసిన శ్రేయాస్ అయ్యర్ జాగ్రత్తగా ఆడుతూ జట్టును సురక్షిత స్థితిలో నిలిపాడు. కానీ పుజారా 90 సెంచరీకి 10 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు మరియు మెహిదీ 2 వికెట్లు తీసుకున్నాడు.
క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (82) ఒక్కడే ఉన్నాడు... జట్టులో కీలక సమయంలో చోటు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇండియా జట్టులో రాహుల్, కోహ్లీ, మరియు గిల్ లు ఫెయిల్ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఇదే విధంగా ఆడితే మ్యాచ్ ను బంగ్లాకు అప్పగించాలసిందే. మరి చూద్దాం రేపు శ్రేయాస్ అయ్యర్ ఎంత వరకు మొదటి ఇన్నింగ్స్ స్కోర్ ను పెంచగలడో... ?