సాధారణంగా టి20 ఫార్మాట్ అంటే బ్యాట్స్మన్ లదే హవా నడుస్తూ ఉంటుందని క్రికెట్ నిపుణులు చెబుతూ ఉంటారు. క్రీజు లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా పరుగుల వరద పారించటం చేస్తూ ఉంటాడని అందరూ అంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం బౌలర్ల ది కూడా హవా నడుస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే బ్యాట్స్మెన్లు  రెచ్చిపోయినట్లుగానే బౌలర్లు కూడా రెచ్చిపోయి వికెట్స్ తీయడం ఇక తక్కువ పరుగులకే ప్రత్యర్థిని  కట్టడి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా ఇక ప్రత్యర్థి టీం ఖాతాలో చెత్త రికార్డు చేరిపోయేలా అదరగొడుతూ ఉంటారు.


 బిగ్ బాష్ లీగ్ లో కూడా ఇలాంటి సంచలనమే నమోదయింది అని చెప్పాలి. ఆడి లైట్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్లో సిడ్నీ థండర్స్ జట్టు కేవలం 15 పరుగులకే ఆల్ అవుట్ కావడం కాస్త ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డులు నమోదు చేసింది సిడ్ని థండర్స్ జట్టు. అంతే కాకుండా పవర్ ప్లే లో తొలి ఆరోవర్లు ముగియకుండానే ఆల్ అవుట్ అయిన జట్టుగా కూడా సిడ్నీ థండర్స్  చెత్త రికార్డును నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆడిలైట్ స్ట్రైకర్స్ జట్టు  20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.


 ఇందులో క్రిస్ లీన్  36 పరుగులతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.  అయితే ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బలిలోకి దిగిన సిడ్నీ థండర్స్ జట్టు ఎంతో అలవోకగా టార్గెట్ చేధిస్తుందని అందరూ అనుకున్నారు. 5.5 ఓవర్లు మాత్రమే ఆడిన సిడ్ని థండర్స్ జట్టు 15 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. అలెక్స్ హేల్స్, రిలీ రోసో, డేనియల్ సామ్స్ లాంటి స్టార్ ప్లేయర్ లు ఉన్న సిడ్ని థండర్స్ జట్టు కనీస పరుగులు చేయలేకపోయింది అని చెప్పాలి. ఇక ఇందులో ఐదుగురు ఎలాంటి పరుగులు ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుతిరిగారు.  మిగతా ఆరుగురు సింగిల్ డిజిట్ స్కోర్ కె పరిమితమయ్యారు. టి20 క్రికెట్ చరిత్రలో సీనియర్ విభాగంలో సిడ్నీ థండర్స్ ఇప్పటికే అత్యల్ప స్కోరు (21రన్స్) చేసిన జట్టుగా ఉంది.  ఇటీవల 15 పరుగులతో మరోసారి తన చెత్త రికార్డును తానే బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: