
రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న లియోనల్ మెస్సి చివరి కప్ లో వరల్డ్ కప్ సాధించాలి అన్న ఆశను నెరవేర్చుకున్నాడు. అయితే ఖాతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఇక ఎన్నో రికార్డులకు వేదికగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొన్న అన్ని జట్లు ఇక ఆయా జట్ల ఆటగాళ్లు కూడా అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇలా ఆటగాళ్లు రికార్డులు సృష్టించడం కొత్తేమి కాదు. ఇక ఎప్పుడు మ్యాచ్ జరిగిన మంచి ప్రదర్శన చేసి రికార్డులు క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు.
కానీ ఫ్యాన్స్ రికార్డులు సృష్టించడం గురించి ఎప్పుడైనా విన్నారా. అభిమానులు రికార్డు సృష్టించడమేంటి అలా ఎలా కుదురుతుంది అని అంటారు ఎవరైనా. కానీ ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఒక అభిమాని ఏకంగా అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యూకే కి చెందిన ఫుట్బాల్ అభిమాని మ్యాచులు చూసి వరల్డ్ రికార్డు సాధించాడు. వృత్తిరీత్యా యూట్యూబర్ అయిన థియో ఇక ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో మొత్తంగా 64 మ్యాచ్లను స్టేడియంలో వీక్షించాడు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ప్రతి మ్యాచ్కి హాజరైన అభిమానిగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇక ఈ ఘనత సాధించినందుకుగాను అతనికి మ్యాచ్లో వాడిన ఫుట్బాల్ బహుమతిగా అందింది.