
ఈ క్రమంలోనే ఇక ఈ మినీ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరు అన్న విషయంపై ఇప్పటివరకు ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం లాంటివి చేశారు. ఇకపోతే ఐపీఎల్ చరిత్రలోనే మునిపెన్నడూ లేని విధంగా అత్యధిక ధరను ఒక ఆటగాడు సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఆ స్టార్ ప్లేయర్ ఎవరో కాదు ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న శ్యామ్ కరన్. మొన్నటి వరకు అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగాడు శ్యామ్ కరన్. ఇక తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు అని చెప్పాలి.
ఇక ఇప్పుడు ఐపీఎల్ మినీ వేలంలో కూడా అన్ని ఫ్రాంచైజీలు అతని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఏకంగా మినీ వేలంలో అతనికి 18.5 కోట్లు భారీ ధరకు కొనుగోలు చేసింది ఓ ఫ్రాంచైజీ. ఈ క్రమంలోనే ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక దరిక పలికిన ఆటగాడిగా శ్యామ్ కరన్ రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి. కాగా ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ 16.25 కోట్ల ధర టాప్ లో ఉండగా ఇక ఇప్పుడు శ్యామ్ కరన్ ఆ రికార్డును చెరిపేసాడు. ఒక 18.50 కోట్లకు అతన్ని పంజాబ్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది అని చెప్పాలి.