గత కొంతకాలం నుంచి పేలవమైన ఫామ్ కొనసాగిస్తూ వరుస వైఫల్యాలతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు రిషబ్ పంత్. అన్ని ఫార్మట్ల లో కూడా ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో  అతని జట్టు నుంచి పక్కకు పెట్టాల్సిందే అంటూ ఎంతో మంది టీమిండియా అభిమానులు కూడా డిమాండ్ చేశారు అన్న విషయం తెలిసిందే. ఇలా విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్ అటు బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో మాత్రం తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే మొదటి  టెస్ట్ మ్యాచ్లో దూకుడుగా ఆడి విమర్శకుల నోళ్లు మూయించాడు రిషబ్ పంత్.


 బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు అని చెప్పాలి. టాప్ ఆర్డర్ మొత్తం తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయి చేతులెత్తేసిన వేళ శ్రేయస్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. ఇలాంటి సమయంలోనే ఇక శ్రేయస్ అయ్యర్ తో కలిసి రిషబ్ పంత్ మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే 105 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ 93 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 5 సిక్సర్లు ఉండడం గమనార్హం. రిషబ్ పంత్ సెంచరీ సాధిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ 67.5 ఓవర్లలో మెహది హసన్ మిరాజ్ బౌలింగ్లో నోరూల్ హసన్ కు క్యాచ్ ఇచ్చిన పంత్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.


 అయినప్పటికీ ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు అని చెప్పాలి. శతకం చేజార్చుకున్నప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరిట ఉన్న రికార్డ్ ను మాత్రం రిషబ్ పంత్ బద్దలు కొట్టేసాడు అని చెప్పాలి.  ఇటీవలే రెండో టెస్టులో భాగంగా 49 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో బంగ్లాదేశ్ పై ధోని తర్వాత అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన వికెట్ కీపర్ గా నిలిచాడు. 2007లో ఇదే వేదికపై ధోని 50 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఇక ధోని, వృద్ధిమాన్ సాహ తర్వాత బంగ్లా గడ్డపై 50 పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ గా కూడా రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: