
ఇక ఐపీఎల్ హిస్టరీలో ఇప్పుడు వరకు ఇక ఏ ఆటగాడు కూడా ఇంత భారీ మొత్తంలో ధర పలకలేదు. ఇక మొదటిసారి సామ్ కరణ్ ఈ రేంజ్ లో ధర పలికి చివరికి రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అయితే సామ్ కరణ్ ఐపీఎల్ మినీ వేలంలో అందరికంటే ఎక్కువ ధర పలుకుతాడు అనే విషయాన్ని అటు వెస్టిండీస్, ఐపీఎల్ మాజీ ఆటగాడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ముందుగానే ఊహించాడు అన్నది తెలుస్తుంది. మినీ వేలం ప్రారంభించడానికి ముందు ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడాడు క్రిస్ గేల్. ఈ క్రమంలోనే సామ్ కరన్ కు భారీ డిమాండ్ ఉంటుందని ముందుగానే ఊపించాడు.
సామ్ కరణ్, బెన్ స్టోక్స్, కామరూన్ గ్రీన్ లో ఎవరు బెస్ట్ ప్రైస్ అందుకుంటారు అని క్రిస్ గేల్ ను ప్రశ్నించగా.. సామ్ కరణ్ బెన్ స్టోక్స్ ఎక్కువ ధర పలుకుతారని నేను అనుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పాడు. గేల్ ఇక ఇద్దరు కుర్రాళ్ల కోసం 16 కోట్లకు పైగా చెల్లించే ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి అంటూ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఫ్రాంచైజీలు అన్నీ కూడా భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇక అన్ని ఫ్రాంచైజీలకు కూడా సామ్ కరన్ లాంటి వంటి ఆటగాడే కావాలి. అందుకే అతనికి అందరికంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది అంటూ క్రిస్ గేల్ చెప్పుకొచ్చాడు. అనుకున్నట్లుగానే మినీ వేలంలో అతనికి రికార్డు స్థాయిలో 18.50 కోట్ల ధర పలికింది.