ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయనతార. ఒకప్పుడు అందరి హీరోయిన్ల లాగానే గ్లామర్ పాత్రలో నటించి కుర్ర కారు మత్తు పోగొట్టిన నయనతార.. ఇప్పుడు మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక సీనియర్ హీరోల సరసన పర్ఫెక్ట్ జోడీగా పేరు సంపాదించుకుని ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది అని చెప్పాలి. ఇండస్ట్రీ లోకి ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్న అటు నయనతార క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే గత కొంతకాలం నుంచి నయన తార ప్రతి విషయంలో కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. నయనతార నటించిన సినిమాల దగ్గర నుంచి ప్రేమ పెళ్లి పిల్లలు ఇలా అన్నీ కూడా సంచలనాలు గానే మారిపోయాయి. ఇక ఇటీవల నయనతార ప్రధాన పాత్రలు తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి నటించిన చిత్రం కనెక్ట్. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్ పతాకం పై నిర్మించారు. ఈనెల 22వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో కూడా మరోసారి నయనతార వ్యవహార శైలి సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.


 సాధారణంగా నయనతార ఎంతటి స్టార్ హీరో సినిమాలో నటించిన సరే కూడా కేవలం షూటింగ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ప్రమోషన్స్ ని అసలు పట్టించుకోదు. హీరో సహా చిత్ర బంధం అందరూ కూడా ప్రమోషన్స్ లో తల మునుకలవుతున్న సమయంలో కూడా నయనతార హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. కానీ ఇటీవల తన భర్తతో కలిసి నటించిన సినిమా కోసం మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనడం అందరిని ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా అంటూ అడిగిన ప్రశ్నకు దయ్యం అంటే తనకు నమ్మకం లేదని.. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం భయంగా ఉంటుందని నయనతార చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా దయ్యాల సినిమాలకు తాను పెద్ద అభిమాని అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: