ఇటీవలే ఖతార్ వేదికగా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్గా కొనసాగుతున్న అర్జెంటినా కెప్టెన్ లియోనాన్ ఎస్సీ తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు అన్న విషయం తెలిసిందే. తన కెరియర్లో ఒక్కసారి అయినా వరల్డ్ కప్ విజేతగా నిలవాలని కోరుకున్న లియోనాల్ మెస్సి  తన కెరీర్ లో చివరి వరల్డ్ కప్  లో ఈ ఘనత సాధించి అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచేసాడు. ఈ క్రమంలోనే లియోనల్ మెస్సి సైతం ఇక వరల్డ్ కప్ విజయం తర్వాత ఎంతో ఆనందంలో మునిగిపోయాడు అని చెప్పాలి.


 అయితే ఒకవైపు వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్నప్పటికీ మరోవైపు తాను వరల్డ్ కప్ గెలవడానికి.. స్టార్ ప్లేయర్గా ఎదగడానికి తనకు మద్దతు పలికిన ఫాలోవర్లని అభిమానులందరినీ కూడా మరిచిపోకుండా సోషల్ మీడియా వేదిక వారికోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన లియోనాల్ మెస్సేకి అటు భారత్ లో కూడా పెద్ద సంఖ్యలో ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఫిఫా వరల్డ్ కప్ సమయంలో అర్జెంటీనా జట్టుకు మద్దతుగా ఎంతో మంది అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం లాంటివి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు  ఏకంగా భారత క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా ఉన్న ధోని కోహ్లీ లాంటి క్రికెటర్లు కూడా లియోనల్ మెస్సిని ఫాలో అవుతూ ఉంటారు.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత క్రికెట్లో లెజెండరీ క్రికెటర్గా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కూతురుకి స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సి   ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. ఏకంగా తాను సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని ధోని కూతురు జీవాకు పంపాడు లియోనల్ మెస్సి. ఈ క్రమంలోనే  మెస్సి పంపిన జెర్సీ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జీవ. అంతే కాదు తన అభిమాన ఆటగాడు నుంచి ఇలాంటి గిఫ్ట్ రావడంతో ఇక ఆనందంతో ఉబ్బితైపోయింది అని చెప్పాలి. కాగా జెర్సీపై జీవా కోసం అని కూడా రాసి ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: