2023 ఏడాది ముగిసింది. ఇక ఈ ఏడాదిలో అన్ని జట్లు కూడా అన్ని ఫార్మాట్లలో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాయి అని చెప్పాలి. ఇక ఎప్పటిలాగానే గెలుపు ఓటములతో ప్రస్థానాన్ని కొనసాగించాయి. ఈ క్రమంలోనే  2022 ఏడాది ముగిసిన నేపథ్యంలో ఇక ఈ మొత్తం ఏడాదిలో ఎవరు మంచి ప్రదర్శన చేశారు అన్న విషయం కూడా ప్రస్తుతం ప్రస్తావనకు వస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ప్రత్యేకమైన అవార్డులు ఇవ్వడానికి సిద్ధమయింది అన్న విషయం తెలిసిందే. క్రికెట్లో ఉన్న మూడు ఫార్మాట్లలో కూడా అసమాన్యమైన ఫామ్ కనబరిచిన ఆటగాళ్ల లిస్టును ఇటీవలే ప్రకటిస్తూ ఉండడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఇటీవలే టి20 ఫార్మాట్ కు సంబంధించి 2022 ఇయర్లో ఎమర్జెన్ ప్లేయింగ్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్ల వివరాలను ప్రకటించింది.  అయితే ఈ రేసులో అటు భారత జట్టు నుంచి బ్యాటింగ్ సంచలనం సూర్య కుమార్ యాదవ్  చోటు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇక ఇటీవల వన్డే ఫార్మాట్ కు సంబంధించి ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్ల వివరాలను ప్రకటించడం గమనార్హం. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన లిస్టులో భారత జట్టు నుంచి ఒక్క ఆటగాడు కూడా రేసులో నిలవకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఐసీసీ ప్రకటించిన మెన్స్ వన్డే ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు రేసులో నామినేట్ అయిన ఆటగాళ్ల వివరాలను ప్రకటించగా.. ఇందులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, జింబాబ్వే  సంచలనం సికిందర్ రాజా, వెస్టిండీస్ హిట్టర్ షై హోప్ చోటు సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఇక వన్డే ఫార్మాట్లలో అటు భారత్ నుంచి ఒక్కరు కూడా చోటు సంపాదించుకోకపోవడం ఏంటి అని ఎంతోమంది భారత ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఐసీసీని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాగా ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న నలుగురు ఆటగాళ్లలో అవార్డు ఎవరు దక్కించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc