
అయితే అప్పటివరకు టీమిండియా కెప్టెన్సీ రేసులో అస్సలు కనిపించని పాండ్యా పేరు ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా అతను సక్సెస్ అయిన తర్వాత మాత్రం అందరికంటే ముందుకు వచ్చి టాప్ లో నిలిచింది అని చెప్పాలి. దీంతో అప్పటినుంచి టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నే అంటూ అందరూఅభిప్రాయపడ్డారు. ఇక ఆ తర్వాత కాలంలో వరుసగా టీమ్ ఇండియాను ముందుకు నడిపించే అవకాశాన్ని దక్కించుకున్న హార్థిక్ పాండ్యా తన కెప్టెన్సీ నైపుణ్యంతో టీమ్ ఇండియాకు వరుస విజయాలు అందిస్తూ వచ్చాడు అన్న విషయం తెలిసిందే.
అయితే తనలో దాగి ఉన్న కెప్టెన్సీ సామర్థ్యం మెరుగు పడటానికి ఇక భారత మాజీ ఆటగాడే కారణం అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హార్థిక్ పాండ్య. అతను ఎవరో కాదు ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కోచ్గా వ్యవహరిస్తున్న ఆశిష్ నెహ్ర అంటూ తెలిపాడు. అతని కారణంగానే తన కెప్టెన్సీలో చాలా మార్పులు వచ్చాయి అంటూ వెల్లడించాడు. గుజరాత్ జట్టు తరుపున ఆశిష్ నెహ్రతో పని చేయడం అద్భుతం.. నా జీవితంలో పెద్ద మార్పు అతని తీసుకురాగలిగాడు. మా ఇద్దరి మైండ్ సెట్ ల వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎందుకంటే మేము వ్యక్తిత్వం పరంగా వేరువేరుగా ఉంటాం. కానీ క్రికెట్ టీం ఆలోచనలు మాత్రం ఒకేలా ఉంటాయ్. అతనితో పనిచేయడం వల్లే నా కెప్టెన్సీకి విలువ చేకూరింది.. నేనేంటో నాకు తెలిసింది అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.