
ఈనెల 23వ తేదీన కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. తన ప్రియ సఖి అయిన అతీయ శెట్టిని ఇక పెద్దల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇందుకోసం బీసీసీఐ పర్మిషన్తో ఇక పెళ్లికి సెలవులు కూడా తీసుకొని ఇక జట్టుకు దూరంగా ఉండనున్నాడు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు మరొక క్రికెటర్ కూడా పెళ్లి పీటలేక్కపోతున్నాడు అన్నది తెలుస్తుంది. భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న అక్షర పటేల్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నాడట.
తన ప్రియురాలు మేహ పటేల్ తో కలిసి ఇక ఈ నెలలోనే ఏడడుగులు వేయబోతున్నాడట ఆల్రౌండర్ అక్షర్ పటేల్. కాగా అక్షర్ పటేల్ మేహ పటేల్ తో ఎన్నో రోజుల నుంచి డేటింగ్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడికి వెళ్లినా మేహ పటేల్ అక్షర్ పటేల్ తోనే కనిపిస్తూ ఉండేది. ఇకపోతే ఇక తన పెళ్లి నేపథ్యంలో న్యూజిలాండ్తో జరిగే టి20 వన్డే సిరీస్ లకు కూడా అతనికి విశ్రాంతి ప్రకటించింది బీసీసీఐ. ఇలా టీమ్ ఇండియాలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు పెళ్లి పీటలు ఎక్కబోతు ఉండడంతో ఇక అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.