ఈనెల 23వ తేదీన టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అతియా  శెట్టి  వివాహం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయబడిన వేదికపై వీరి వివాహం ఎంతోమంది అతిధుల మధ్య జరగబోతుంది. అయితే ఇక వీరి వివాహం కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలోకి వస్తూ అది హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. అయితే సునీల్ శెట్టి తన కుమార్తె వివాహానికి కేవలం కొంతమంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం పంపబోతున్నారు అన్నది ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అదే సమయంలో ఇక అందరి క్రికెటర్ల లాగానే అటు కేఎల్ రాహుల్ సైతం కొంతమంది అతిధుల సమక్షంలోనే వివాహం జరుపుకోబోతున్నారు అన్నది తెలుస్తుంది


 ఈ క్రమంలోనే అటు అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టికి ఉన్న స్నేహం ప్రకారం ఇక బాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖులు ఇక కేఎల్ రాహుల్ వివాహానికి హాజరు కావచ్చట. అదే సమయంలో ఇక కేఎల్ రాహుల్ కి స్నేహితుడు అయిన విరాట్ కోహ్లీ సైతం ఈ వివాహానికి హాజరవుతాడు అన్నది తెలుస్తుంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కేఎల్ రాహుల్ వివాహానికి వచ్చే ఛాన్స్ ఉందట. అయితే ఇక ఇప్పటికే సునీల్ శెట్టి సన్నిహితులు కాండాలలోని అతని ఫామ్ హౌస్ కు రావడం ప్రారంభించారట. నేటి నుంచి ఇక వివాహ వేడుకలో కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పాలి. నేడు లేడీస్ నైట్ సంగీత వేడుకను నిర్వహించబోతున్నారట.


 అతిథులకు ఎలాంటి లోటు రాకుండా సునీల్ శెట్టి ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు నువ్వు చేసేసారు అన్నది తెలుస్తుంది. సునీల్ శెట్టి తన కూతురు వివాహాన్ని చిరస్మరణీయంగా నిలిచే విధంగా చేయాలని ఇక ఖర్చు విషయంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయడం లేదట. కానీ గతంలో కేఎల్ రాహుల్ సైతం ఇక తన వివాహాన్ని ఎంతో సింపుల్గా చేసుకుంటాను అంటూ పలుమార్లు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇక ఈ పెళ్లి వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది సాధ్యమయ్యే పనికాదు. అయితే ఇక పెళ్లి పూర్తయిన తర్వాత మాత్రం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: