గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకోలేకపోతున్న యువ సంచలనం పృథ్వి షా అటు దేశవాళీ క్రికెట్లో మాత్రం తన కసి మొత్తం చూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతూ ఉన్నాడు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా అంచనాలకు మించి రాణిస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో పృథ్వి షా ప్రదర్శన అమోఘం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముంబై తరపున ఆడుతూ జట్టు విషయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. అయితే ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై, అస్సాం మధ్య జరిగిన మ్యాచ్లో పృథ్వి షా బ్యాటింగ్ తో ఎంతలా చెలరేగిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు సిక్సర్లు ఫోర్లు కొడుతూ చెలరేగిపోయాడు. 383 బంతుల్లో 49 ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో 379 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 400 పరుగులు చేసే సువర్ణ అవకాశాన్ని 21 పరుగుల తేడాతో కోల్పోయాడు. అయితే పృథ్వి షా 21 పరుగులు చేసి ఉంటే ఒక అరుదైన రికార్డు అతని ఖాతాలో చేరిపోయేది అని చెప్పాలి.  దీంతో సగటు అభిమాని కూడా ఎంతగానో ఫీల్ అయ్యాడు. ఇదే విషయంపై పృథ్విషా కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 అస్సాంతో జరిగిన మ్యాచ్లో ఏకంగా క్యాడ్రాపుల్  సెంచరీ చేసే సువర్ణ అవకాశాన్ని మిస్ అయినందుకు ఇప్పటికి బాధపడుతున్న అంటూ తెలిపాడు. అలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడైనా వస్తే తప్పిదాలు చేయను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే 2021 లో శ్రీలంక టూర్ లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో చివరిసారి టీమిండియాకు ఆడాడు. ఇటీవల త్రిబుల్ సెంచరీ బాధడంతో దాదాపు 18 నెలల తర్వాత ఇక టీమిండియా నుంచి పిలుపును అందుకున్నాడు అని చెప్పాలి. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో భాగంగా పృథ్వి షా జట్టులో కనిపించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: