
వెరసి ఇక ఇటీవల కాలంలో ఇక ప్రతి మ్యాచ్లో చెలరేగిపోతున్న యువ ఆటగాళ్లకు సంబంధించిన వార్త అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ ఆట తీరుతో తామే భారత క్రికెట్కు ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు ఎంతోమంది యువ సంచలనాలు. ఇక ఇటీవల కాలంలో అయితే కొంతమంది తమ స్థానాన్ని భారత జట్టులో కూడా సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ ఎవరు అనే విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్ కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
డబుల్ సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్.. ఫేస్ వీరుడు ఆర్షదీప్ సింగ్ టీమిండియాలో ఫ్యూచర్ స్టార్స్ గా ఎదుగుతారు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్.. అర్షదీప్ సింగ్ బౌలింగ్ జట్టును విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతుందని చెప్పకొచ్చాడు. వెస్టిండీస్ దిగజం క్రిస్ గేల్ సైతం అనిల్ కుంబ్లే అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఆ ఇద్దరే ఫ్యూచర్ స్టార్స్ అంటూ చెప్పాడు. కానీ అటు భారత మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ మాత్రం ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్అంటూ అభిప్రాయపడ్డాడు అని చెప్పాలి. కాగా తిలక్ వర్మ ఇప్పటివరకు భారత జట్టు తరఫున అరంగేట్రం చేయలేదు. జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.