ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ ఇక ఇటీవల టీమ్ ఇండియా టెస్ట్ జట్టులోకి అరంగేట్రం చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అతని ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై తెలుగు క్రికెట్ పరీక్షకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా ఇక ఇటీవల నాగపూర్ వేదికగా ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్లో భాగంగా కేఎస్ భరత్ ఏకంగా మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేసి ఏకంగా మహేంద్ర సింగ్ ధోని గుర్తు చేశాడు. దీంతో అతనిపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.


 అయితే నాగ్ పూర్ వేదికగా  ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్లో మొదట ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే టాస్ మనమే గెలిచాము అన్న ఆనందం ఆస్ట్రేలియాకు కాసేపు కూడా మిగల్చకుండా చేశారు భారత్ ఫేసర్లు. ఇక భారత్ వేసిన రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. దీంతో భారత్ కి శుభారంభం లభిస్తే ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత కూడా స్పిన్నర్లు మాయ చేసి ఇక కీలకమైన వికెట్లను పడగొట్టారు. దీంతో 177 పరుగులకే అటు ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే తన కెరియర్లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ ఏకంగా రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేసి సరి చేశాడు అని చెప్పాలి. జడేజా బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పదే పదే వికెట్ల ముందు ప్యాడ్ అడ్డు పెడుతూ ఉన్నారు. దీంతో ఇక భారత ఆటగాళ్లందరూ ఎంతో కాన్ఫిడెంట్ తో అప్ఫీల్ చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రివ్యూ కి వెళ్లాలని అనుకున్నాడు. కానీ తొలి టెస్ట్ ఆడుతున్న వికెట్ కీపర్ కేఎస్ భరత్ మాత్రం అవుట్ కాదేమో అని సందేహం వ్యక్తం చేయడంతో రివ్యూ నిర్ణయాన్ని విరమించుకున్నాడు  రోహిత్. ఆ తర్వాత రిప్లై లో చూస్తే అది నాటౌట్ గా తేలింది. ఒకవేళ రోహిత్ రివ్యూకి వెళ్లి ఉంటే టీమ్ ఇండియా రివ్యూకోల్పోయేది అని చెప్పాలి. దీంతో రోహిత్ భారత్ ను అభినందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: