బీసీసీఐ తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా దశాబ్దాల నుంచి సరైన ఆదరణకు నోచుకోని మహిళా క్రికెటర్లకు ప్రస్తుతం యుగం ప్రారంభమైందా అంటే ప్రస్తుతం ప్రతి చోట అవును అనే సమాధానమే వినిపిస్తూ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే దేశీయ లీగ్ ను ప్రారంభించి సూపర్ సక్సెస్ అయిన బీసీసీఐ ఇక ఇప్పుడు మహిళా క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని కూడా ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ ఏడాది నుంచి మొదటి సీజన్ ప్రారంభం కాబోతుంది.


 ఇక అంతకుముందు పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలు చెల్లించేందుకు నిర్ణయించిన బీసీసీఐ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కారణంగా మహిళా క్రికెటర్లు కూడా కోట్ల రూపాయలు సంపాదించి ఆర్థికంగా నిలదోక్కుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ముంబై వేదికగా జరిగిన వేలంలో ఎంతోమంది మహిళా క్రికెట్లు కోట్ల రూపాయల ధర పలికారు అని చెప్పాలి. ఇలా అప్పటివరకు ఎక్కడ సరైన వేతనాలు అందుకోని వారు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఒక్కసారిగా జాక్పాట్ కొట్టేశారు.


 ఈ క్రమంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో యువ క్రికెటర్ పూజా వస్త్రాకర్ కు 1.9 కోట్లు వెచ్చించి ముంబై జట్టు కొనుగోలు చేసింది. అయితే ఇదే విషయంపై ఆమె తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమెకు ఇంత భారీ ధర పలికినందుకు ఆమె తండ్రి మాత్రం సంతోషంగా లేరట. పూజ ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుందని ఆయన ఆందోళన చెందుతున్నారట. ఆ సొమ్ము మొత్తం పూజ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులో చోటు సంపాదించుకున్న పూజా వస్త్రాకర్ సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. కాగా ఇటీవలే తన తండ్రికి 15 లక్షల విలువైన కారును కొనిచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: