
ఇదే ఊపును కనుక సాగిస్తే గ్రూప్ బి నుండి సెమీస్ కు చేరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు... కానీ సెమీస్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్ల నుండి పోటీ ఎదుర్కునే అవకాశం ఉంది. అందుకే జట్టులోని అందరూ సమిష్టిగా ఆడితేనే ఫైనల్ కు అర్హత సాధిస్తారు. ఇండియా తర్వాత మ్యాచ్ శనివారం రోజున ఇంగ్లాండ్ తో ఆడనుంది. ఇందులో కనుక విజయం సాధిస్తే ఆడిన మూడు మ్యాచ్ లలో మూడింటినీ గెలిచినందువలన సెమీస్ కు ఈజీగా అర్హత సాధిస్తుంది. ఒకవేళ సెమీస్ చేరుకుంటే ఇండియా ఆస్ట్రేలియా తో తలపడాల్సి వస్తుంది.
ఈ టోర్నీలో ట్రోఫీని గెలుచుకోగల సామర్ధ్యం ఉన్న జట్లలో ఆస్ట్రేలియా ప్రధమ స్థానంలో ఉంటుందని చెప్పగలము. ఆ తర్వాత ఇంగ్లాండ్ మరియు ఇండియా లను చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలోనూ కఠినమైన సవాలు ఎదుర్కోకపోవడంతో మన వీక్ నెస్ లు బయటపడలేదు. ఇక నిన్నటి మ్యాచ్ లో అయితే వెస్ట్ ఇండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి 19 వ ఓవర్ వరకు తీసుకోవడం ఆశ్చర్యకరం. ఇదే విధంగా ఆడితే ట్రోఫీని సాధించడం కాదు కదా , ఫైనల్ కు చేరడం కూడా గగనమే. మరి చూద్దాం ఏమి జరగనుందో ?