టీమిండియాలో కీలకమైన ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవీంద్ర జడేజా. తన బౌలింగ్ తో మాత్రమే కాదు బ్యాటింగ్ తో కూడా విధ్వంసం సృష్టించి సంచలన రికార్డులు కూడా సాధిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఆసియా కప్ సమయంలో మోకాలి గాయం బారిన పడిన రవీంద్ర జడేజా ఇక శస్త్ర చికిత్స చేసుకొని దాదాపు 5 నెలల పాటు టీమ్ ఇండియాకు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అనుకున్నప్పటికీ.. పట్టుదలతో ఎంతో వేగంగా గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించాడు రవీంద్ర జడేజా.


 ఈ క్రమంలోనే ఇప్పుడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా భారత జట్టులో భాగం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే రీ ఎంట్రీ తర్వాత కొంతమంది ఆటగాళ్లు మునుపటి ఫామ్ను ప్రదర్శించలేక తడబడటం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ రవీంద్ర జడేజా మాత్రం ఇలా రీఎంట్రీ తర్వాత మరోసారి అదరగొడుతూ ఉన్నాడు. తన సత్తా ఏంటో నిరూపిస్తూ ఉన్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టి ఇక బ్యాటింగ్లో 70 పరుగులు చేసి జట్టు విషయంలో కీలక పాత్ర వహించాడు.


 ఇక రెండవ టెస్టు మ్యాచ్ లో కూడా తన స్పిన్ బౌలింగ్ తో ఇలాంటి మ్యాజిక్ నే కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసి ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.. భారత్ తరఫున టెస్ట్ ఫార్మాట్లో వేగంగా 250 వికెట్లు తీయడంతో పాటు 2500 రన్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు రవీంద్ర జడేజా. ఇక ఈ లిస్టులో అశ్విన్ తొలి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. మొత్తంగా భారత్ తరఫున ఈ ఫీట్ అందుకున్న వారిలో జడేజా ఐదవ స్థానంలో ఉన్నాడు. అంతకుముందు కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే ఈ అరుదైన రికార్డును సృష్టించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: