
అయితే ఒక్క పరుగు ఆదిక్యంతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు పూర్తిగా తడబడింది అని చెప్పాలి. మొదటిరోజు బాగా ఆడిన బ్యాట్స్మెన్లు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక భారత బౌలింగ్ విభాగం దెబ్బకి ఏకంగా 113 పరుగులకే అటు ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం చాప చుట్టేసింది అని చెప్పాలి. ఎవరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా తన స్పిన్ బౌలింగ్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి. అయితే తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను రెండో ఇన్నింగ్స్ లో మాత్రం టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సంచలన క్యాచ్ తో పెవిలియన్ పంపడంలో సక్సెస్ అయ్యాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో రవీంద్ర జడేజా ఆరో ఓవర్ వేశాడు. ఇక ఈ ఓవర్లో ఐదవ బంతిని స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు ఖావాజా. ఈ క్రమంలోనే లెగ్ గల్లి వద్ద ఫీలింగ్ చేస్తున్న అయ్యర్ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ కుడి వైపుకు వెళుతున్న బంతిని ఎంతో అద్భుతంగా అందుకున్నాడు అని చెప్పాలి. దీంతో ఉస్మాన్ ఖవాజా ఇక ఆరు పరుగుల వద్ద వికెట్ కోల్పోయి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో మంచిగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఇక రివర్స్ స్వీప్ షాట్ కి ప్రయత్నించి ఖవాజా వికెట్ సమర్పించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్ తో ఖవాజ వికెట్ పడగొట్టాడు.