ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది . ఇందులో భాగంగానే నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడం అటు భారత జట్టుకు పెద్ద సవాల్ అని ఎంతో మంది క్రికెట్ నిపుణులు కూడా అంచనా వేశారు. అయితే స్వదేశంలో భారత జట్టు కూడా ఎంతో పటిష్టంగా ఉండడంతో ఇరు జట్ల మధ్య ఓరాహోరీ పోరు జరగడం ఖాయమని భావించారు. కానీ స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుంటున్న టీమిండియా పటిష్టమైన ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తోంది.


నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 132 పరుగులు తేడాతో ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా జట్టు.. ఇక ఇప్పుడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. దీంతో వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి 2-0 తేడాతో ఆదిత్యంలో కొనసాగుతుంది. ముఖ్యంగా రెండవ టెస్టు మ్యాచ్లో విజయం సాధించడంలో అటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు కూడా కీలకపాత్ర వహించారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే భారత్ అద్భుతమైన ప్రదర్శన పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ లో టీమిడియా విజయం సాధించడం పై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఢిల్లీ టెస్ట్ లో విజయం సాధించడంలో భారత్కు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. జడేజా.. కంగారులను చిప్స్ ప్యాకెట్ కాళీ చేసే సమయంలోనే మ్యాచ్ పూర్తి చేశాడు. అశ్విన్ మరోసారి తన క్లాస్ చూపెట్టాడు. అక్షర్ తన బ్యాట్ తో నాయకత్వం వహించాడు. ఇక రెండు మ్యాచ్ల్లో గెలిచిన టీమిండియా ట్రోఫీని సీల్ చేసింది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: