
ఈ క్రమంలోనే చటేశ్వర్ పూజార ఇక ఇటీవల వరుసగా మ్యాచ్ లలో తుది జట్టులో చోటు సంపాదించుకుంటున్నాడు. కాగా ఇటీవల ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఈ రెండో టెస్ట్ ద్వారా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న చటిశ్వర్ పూజార ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి. భారత క్రికెట్లో కొంతమందికి మాత్రమే పరిమితమైన 100 టెస్ట్ మ్యాచ్ ల రికార్డును చేరుకున్నాడు.
ఈ క్రమంలోనే రెండవ టెస్ట్ ప్రారంభానికి ముందు అటు బీసీసీఐ పూజారను ఘనంగా సన్మానించింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల మ్యాచ్ పూర్తయిన తర్వాత పూజరాకు ఒక అరుదైన గిఫ్ట్ అందింది. ఆస్ట్రేలియా కెప్టెన్ గా కొనసాగుతున్న పాట్ కమిన్స్ ఏకంగా ఆస్ట్రేలియా జెర్సీని పూజారాకు బహుమతిగా ఇచ్చాడు. అయితే ఇక దీనిపై జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ కూడా సంతకాలు పెట్టడం గమనార్హం. అయితే గతంలో నాథన్ లియోన్ 100 టెస్టులు ఆడినందుకు టీమిండియా జెర్సీని గిఫ్టుగా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.