
మొదటి టెస్ట్ మ్యాచ్ లో లాగానే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా అటు భారత బౌలర్లు పూర్తిగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం పై ఆదిపత్యాన్ని చలాయించారు. ఎక్కడ పరుగులు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇక ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో జడేజా తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు.
మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి సత్తా చాటిన జడేజా.. ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా ఓటమిని శాసించాడు అని చెప్పాలి. ఇకపోతే తన బౌలింగ్ ప్రదర్శన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ పిచ్ పై బంతి ఒక్కోసారి అనుకోకుండా స్పిన్ తిరిగితే.. మరోసారి తక్కువ స్పిన్ అయ్యిందంటూ వివరించాడు.. ఆస్ట్రేలియా ప్లేయర్లు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్ ఆడతారని తెలిసే వికెట్ లను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే స్పిన్ వికెట్ పై తన బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడొద్దు అంటూ హెచ్చరించాడు రవీంద్ర జడేజా.