
ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు అని చెప్పాలి. దీంతో వరుస వైఫల్యాలతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు అని చెప్పాలి ఈ క్రమంలోనే అతన్ని పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైనది అంటూ ఎంతో మంది క్రికెట్ అభిమానులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే వైస్ కెప్టెన్ అనే ట్యాగ్ ఉండడం కారణంగానే ఇక అతన్ని ఇంకా జట్టులో కొనసాగిస్తున్నారు అని ఎంతో మంది భావించారు. అయితే ఇలాంటి సమయంలోనే మిగిలిన రెండు టెస్టులకు కూడా రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ అప్పగిస్తున్నట్లు వార్తలు వచ్చాయ్.
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్మెన్ హర్భజన్ సింగ్. ఆస్ట్రేలియాలో జరిగిన రెండు టెస్టుల్లో కలిపి కేవలం 38 పరుగులు మాత్రమే చేసిన కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్సీ నుండి తొలగించడంపై మాట్లాడుతూ వైస్ కెప్టెన్ గా ఉంటే ఆటతో సంబంధం లేకుండా తుది జట్టులో ఏ ఆటగాడైనా ఉంటాడు. కానీ రాహుల్కు ఇప్పుడు వైస్ కెప్టెన్ ట్యాగ్ లేదు. మేనేజ్మెంట్ అతని తొలగించేందుకు సులభతరమైంది. మిగతా రెండు టెస్టులలో రాహుల్ బాగా రాణిస్తాడని అనుకుంటున్నాను అంటూ హర్బజన్ సింగ్ చెప్పుకోచ్చాడు.