
పేపర్ మీద చూసుకుంటే రెండు జట్లు బలంగా ఉన్నాయి. కానీ గ్రౌండ్ లో దిగాక ఎవరైతే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారికే విజయం దక్కుతుంది. అయితే గ్రూప్ దశలో ఆస్ట్రేలియా తామాడిన నాలుగు మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తే.. ఇండియా మాత్రం ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి ఒక అడుగు దిగువన ఉంది అని చెప్పాలి. ఇప్పటి వరకు టీ 20 వరల్డ్ కప్ చరిత్రలో టైటిల్ ను దక్కించుకొని ఇండియా ఈసారి ఎలాగైనా ఆ కోరికను నెరవేర్చుకోవాలన్న కసితో ఉంది. ఇక ఆస్ట్రేలియా మాత్రం ఎవ్వరికి అందనంత ఎత్తులో సక్సెస్ రేట్ తో దూసుకుపోతోంది.
ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపు సాధించాలంటే మొదట టాస్ గెలిచి ఛేజింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఒకవేళ ఛేజింగ్ ఆస్ట్రేలియా కు వెళితే 180 +పరుగులు అయినా సునాయాసంగా చేధించగలదు. ముఖ్యంగా ఈ టీం లో హీలీ, మూనీ, లానింగ్, పెర్రీ , గార్డనర్ , మెక్ గ్రాత్ లు బ్యాటింగ్ లో ఆస్ట్రేలియాకు కీలకంగా మారనున్నారు. వీరిని అడ్డుకోగలిగితే ఇండియా ఫైనల్ చేరడం ఈజీ అవుతుంది. అదే సమయంలో ఇండియా ఆటగాళ్లు సైతం అంచనాలకు తగినట్లు రాణించాలి. మరి చూద్దాం ఈ రోజు జరగనున్న మొదటి సెమి ఫైనల్ లో గెలిచి ఫైనల్ బెర్త్ ను ఎవరు దక్కించుకుంటారో ?