కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ చాలా సంవత్సరాల క్రితం మంకథ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి త్రిష హీరోయిన్గా నటించింది. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అర్జున్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని తెలుగు లో గ్యాంబ్లర్ అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే తాజాగా మంకథ సినిమాను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ..? మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో 11.85 కోట్ల కలెక్షన్లు దక్కగా , కర్ణాటక ఏరియాలో 65 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు ఓవర్ సిస్ లో 1.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 13.95 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఈ మూవీ కొత్త సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak