2024 ఎన్నికలలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు హామి పథకాన్ని చెప్పగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు. ఈ ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీ పైన ఒత్తిడీ పెరుగుతోందని, ఉద్యోగులు సైతం అసంతృప్తితో ఉండడంతో ఈ నేపద్యంలోనే ప్రస్తుతం ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేయడంతో వీటి పైన చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం మొత్తం 7673 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వనికి ప్రతిపాదన పంపించారు. అయితే ఇందులో 3673 డ్రైవర్లు, 1813 కండక్టర్ పోస్టులు, అలాగే మెకానికల్, శ్రామిక్ , ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.
ఆయా ఉద్యోగాల భర్తీ కోసం అనుమతి ఇవ్వాలంటూ ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి ప్రభుత్వానికి విజ్ఞప్తిని పంపించారు. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీకి పరిశీలిస్తోంది. మరి ఏపీ ప్రభుత్వం వీటి పైన ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి. అలాగే ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న డ్రైవర్లు కండక్టర్ల జీతాలు కూడా పెంచబోతున్నట్లు సమాచారం. ఆన్ కాల్ డ్రైవర్లకు రోజువారి వేతనం రూ .800 నుంచి రూ .1000 రూపాయలకి, అలాగే డబ్బులు డ్యూటీ కండక్టర్లకు రూ . 900 రూపాయల వరకు పెంచుతున్నట్లు తెలియజేశారు. గత కొంతకాలంగా ఆన్ కాల్ డ్రైవర్లు కండక్టర్లు సైతం అసంతృప్తితో ఉన్న విషయాన్ని గుర్తించి, వారిలో ఉండే అసంతృప్తిని కూడా తీర్చబోతున్నారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను కూడా తీసుకురాబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి