మహారాష్ట్ర ప్రాంతంలో తాజాగా విషాదం జరిగింది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం 8:45 నిమిషాలకు అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి విమానం బారామతిలో ఒక్కసారిగా కుప్ప కూలింది. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటుగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రాంతంలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబై నుంచి బరామతి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.


అయితే ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. ముంబై నుంచి బయలుదేరిన కేవలం గంట తర్వాత విమానంలో సమస్యలు తలెత్తడం ఎమర్జెన్సీ లాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అలా విమానం కింద పడిన వెంటనే రెండు ముక్కలు అయ్యి, భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పైన డీజీసీఏ స్పందిస్తూ విమానంలో ప్రయాణించిన వారు ఎవరు కూడా బతికి లేరని. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు ఇద్దరు వ్యక్తిగత సిబ్బందులు అలాగే ఇద్దరు విమాన సిబ్బందిలు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలియజేశారు.


అజిత్ పవార్ తండ్రి పేరు అనంత్ రావ్ పవార్ ఈయన కూడా సీనియర్ నాయకుడే. అంతేకాకుండా మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు అవుతారు. అజిత్ పవార్ విషయానికి వస్తే 1959 జులైలో జన్మించారు. ఆ తర్వాత 1982లో మొదటిసారిగా కార్పోరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ  బోర్డుకీ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 సంవత్సరాల పాటు పూణేలో సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు కి చైర్మన్ గా పనిచేసిన ఈయన 1991లో మొదటిసారి బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు  ఎన్నిక కాగా, అనంతరం తన బాబాయ్  శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసిన ఈయన రాష్ట్ర రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా 1991లో జరిగిన ఉప ఎన్నికలలో భారామతి అసెంబ్లీ నుంచి గెలుపొందారు..అదే నియోజకవర్గం నుంచి ఏడు సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా ఘనవిజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర నేతృత్వంలో మహాయుత్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణ వార్త విన్న ఆయన కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: