డైరెక్టర్ అట్లీ మాట్లాడుతూ ఈ చిత్రం గురించి రోజు రోజుకి ఏదో ఒక కొత్త డిస్కషన్ చేస్తున్నామని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అప్డేట్ కోసం వారి కంటే తానే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానని తెలిపారు. తప్పకుండా తాము అభిమానులకు సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను చూసి మాక్సిమం ఎంజాయ్ చేస్తారని కూడా తెలిపారు డైరెక్టర్ అట్లీ. అలాగే హీరోయిన్ దీపికా పదుకొనే పాత్ర పైన మాట్లాడుతూ దీపికా తనకు లక్కీ చార్మ్, ఆమె సినిమాలో ఉంటే ఒక పాజిటివ్ ఫీల్ వస్తుందని తెలిపారు.
దీపికా పదుకొనే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నటిస్తున్న మొదటి సినిమా ఇది. ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త దీపికాను తన సినిమాలో చూస్తారని వెల్లడించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే సన్ పిక్చర్ బ్యానర్ పైన పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సాయి అభ్యంతర సంగీతాన్ని అందిస్తున్నారు. డైరెక్టర్ అట్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఏది ఏమైనాప్పటికీ పుష్ప , పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి