
రవీంద్ర జడేజా విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆస్ట్రేలియా తో నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో తుదిజట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా మునుపటి ఫామ్ ను కనబరచడం కాదు. అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రదర్శన చేశాడు అని చెప్పాలి. తన స్పిన్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పులు పెట్టాడు. అంతే కాదు తన అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగులు రాబట్టి ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. అయితే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసిన జడేజా మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
కాగా నేటి నుంచి కూడా భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను మరో రికార్డు ఊరిస్తుంది అని చెప్పాలి. ఇండోర్ వేదికగా జరగబోయే టెస్ట్ మ్యాచ్ లో ఒక వికెట్ తీస్తే చాలు అంతర్జాతీయ మ్యాచుల్లో 500 వికెట్లు 5000 పరుగులు చేసిన రెండవ ప్లేయర్గా జడేజా ఒక అరుదైన మైలు రాయిని చేరుకుంటాడు అని చెప్పాలి. ఇప్పటికే జడేజా అన్ని ఫార్మట్స్ లో కలిపి 5523 పరుగులు చేశాడు. కపిల్ దేవ్ 9031 పరుగులు 687వికెట్లతో ఈ లిస్టులో టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి.