ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో భాగంగా అటు ఆస్ట్రేలియా జట్టుకు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సింహ స్వప్నంలా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందు నుంచే ఇక భారత్లో ఉన్న పిచ్ లపై అశ్విన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఒత్తిడిలో మునిగిపోయారు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు. అతనిలాగే బౌలింగ్ చేసే ఒక యువ బౌలర్ను తెచ్చుకొని మరీ ప్రాక్టీస్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు భయపడినట్లుగానే అటు అశ్విన్ సైతం ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన చేసి వికెట్లు పడగొట్టాడు. ఇక ఇటీవల 4వ టెస్ట్ మ్యాచ్లో సైతం ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు అని చెప్పాలి. ఇలా వరుసగా వికెట్లు పడగొడుతూ అదరగొడుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ప్రపంచ రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటున్నాడు అని చెప్పాలి. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు క్రీజులో పాతుకు పోయి పరుగులు చేస్తున్న వేళ అశ్విన్ తన వైవిధ్యమైన బంతులతో వికెట్ తీసుకుంటూ టీమిండియా కు ఉపశమనం కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా ఆడిన మొదటి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇటీవలే మ్యాచ్లో 6 వికెట్లు తీసిన అశ్విన్ భారత్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచాడు. అంతకుముందు అనిల్ కుంబ్లే 25 సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్న ప్లేయర్గా ఉండగా.. ఇక ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టి అశ్విన్ 26 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇక మరోవైపు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు (113) తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. మరోవైపు ఇక బోర్డర్ గవాస్కర్  ట్రోఫీలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా నాథన్ లియోన్ (113) వికెట్ల రికార్డును సైతం అశ్విన్ బద్దలు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: