
కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని మ్యాచ్ లు అన్నింటినీ కూడా అన్ని జట్ల హోమ్ గ్రౌండ్ లపై నిర్వహించేందుకు అటు బీసీసీఐ కూడా నిర్ణయించింది అని చెప్పాలి. దీంతో ఎంతోమంది ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత ఇక నేరుగా మ్యాచ్ వీక్షించే అవకాశం లభించింది అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ మ్యాచ్లు ఇంకా ప్రారంభం కానే లేదు అప్పుడే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ 2023 ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లు ఏవి అన్న విషయాన్ని ముందుగానే అంచనా వేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇక 2023 ఏడాది ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్ కి చేరే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశాడు సంజయ్ మంజ్రేకర్. అయితే ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ను, గత ఏడాది మొదటి ప్రయత్నంలోనే ఐపిఎల్ టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ని మాత్రం సంజయ్ మంజ్రేకర్ పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పాలి. కాగా ఈ ఏడాది అన్ని జట్లు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఉండడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.