
వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకొని ఒక్క సారిగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి. ఆ యువ ప్లేయర్ ఎవరో కాదు రింకు సింగ్. చివరి ఓవర్ లో కోల్కతా విజయానికి 29 పరుగులు కావాలి. ఇక ఇలాంటి సమయంలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ క్రీజ్ లో ఉన్నా కూడా ఇక ఈ లక్ష్య చేదన చాలా కష్టమే. అలాంటిది ఇక అంతంత మాత్రమే క్రికెట్ లో అనుభవం ఉన్న రింకు సింగ్ లాంటి ప్లేయర్లు ఉంటే దాదాపు ఓటమి ఖరారు అయిపోయినట్లే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు రింకు సింగ్. చివరి ఓవర్లో తనకు ఆడేందుకు అవకాశం వచ్చిన 5 బంతులను కుడా సిక్సర్లుగా మలిచాడు.
దీంతో ఇక గెలుపు కోసం కావాల్సిన 29 పరుగులు అతని వీరోచితమైన ఇన్నింగ్స్ ముందు చిన్నవి అయిపోయాయి అని చెప్పాలి. అయితే అంతకుముందు 19వ ఓవర్ లో కూడా 5, 6 బంతులను సిక్స్ ఫోర్ గా మలిచాడు రింకు సింగ్. ఇక 20వ ఓవర్ లో ఉమేష్ యాదవ్ సింగిల్ తీసి ఇచ్చిన తర్వాత మిగిలిన 5 బంతులను కూడా 5 సిక్సర్లుగా బాదేశాడు అని చెప్పాలి. అప్పుడు వరకు 14 బంతుల్లో 8 పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న రింకు సింగ్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాడు. ఇక ఆ తర్వాత 14 బంతుల్లో 8 పరుగులు ఉన్న స్కోర్ 21 బంతుల్లో 48 కి చేరిపోయింది. ఇక కోల్కతా విజయం సాధించింది అంటే కేవలం రింకు సింగ్ ఇన్నింగ్స్ వల్లే అని చెప్పాలి. ఇక అతని ఇన్నింగ్స్ చూశాక.. బ్యాటింగ్ విధ్వంసం అంటే ఇదేనేమో అని కామెంట్ చేస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు.