సాధారణంగా ప్రతి ఐపీఎల్ సీజన్ కి ముందు మినీ వేలం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలంలో కొంతమంది ఆటగాళ్లపై అపారమైన నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీలు.. వారికోసం భారీ ధర పెట్టేందుకు కూడా సిద్ధమవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే వారు జట్టులోకి వస్తే ఇక తమ టీమ్ ఎంతో పటిష్టంగా మారిపోతుంది అని ఎంతో నమ్మకం పెట్టుకుంటాయి. ఇక వారిని కొనుగోలు చేసేందుకు ఎంత ధర పెట్టేందుకు అయినా సిద్ధమవుతూ ఉంటాయి. ఇక ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరి కోట్ల రూపాయల ధర పెట్టి జట్టులోకి తీసుకుంటాయి.


 అయితే ఇలా భారీ ధర పెట్టి జట్టులోకి కొనుగోలు చేసిన ఆటగాడి ప్రదర్శన పై ఆయా జట్టు యాజమాన్యాలు మాత్రమే కాదు ఇక జట్టు అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకోవడం కామన్. కానీ ఎంతోమంది ప్లేయర్లు ఇలా భారీ ధరతో ఐపీఎల్ లో సత్తా చాటినప్పటికీ.. ప్రదర్శన ద్వారా మాత్రం సత్తా చాట లేక ఎప్పుడు నిరాశ పరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ లో ఇద్దరు ప్లేయర్లు ఇదే చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది. ఆ ఇద్దరు ఎవరో కాదు ఇషాన్ కిషన్, కామెరోన్ గ్రీన్.


 ఈ ఇద్దరి  ఆట తీరుపై ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అభిమానులు అందరూ కూడా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. కోట్ల రూపాయలు వెచ్చించి మరి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఎక్కడ తమ ఆట తీరుతో ప్రభావం చూపించడం లేదు. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ ఏకంగా 15.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతను అదరగొడతాడు అనుకుంటే జట్టు కొంపముంచుతున్నాడు. ఇక స్టార్ ప్లేయర్ కామరూన్ గ్రీన్ ను 17.5 కోట్లకు కొనుగోలు చేస్తే అతనికి దక్కిన ధరకు.. అతను చేస్తున్న ప్రదర్శనకు ఎక్కడ సంబంధం లేకుండా పోయింది. ముంబై ఇండియన్స్ వీరికి ఇన్ని కోట్లు పెట్టి తప్పు చేసింది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl