ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) టీంకి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ టీంకి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సీఎస్‌కే టీం మ్యాచ్ ఆడుతుంటే చాలా మంది క్రికెట్ ప్రియులు ఖచ్చితంగా టీవీలకు అతక్కుపోతారు.మరీ ముఖ్యంగా ఆ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నాడంటే ఆయన అభిమానులకు ఇక పూనకాలు వచ్చినట్లే. తమిళులు జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చాలా సార్లు ఐపీఎల్ లో విజేతగా నిలిచింది. అయితే, సీఎస్‌కే టీం ని ఐపీఎల్ నుంచి నిషేధించాలని తమిళనాడు అసెంబ్లీలో డిమాండ్ వినిపించింది. ఇక పీఎంకే (పాటలి మక్కల్ కట్చీ) పార్టీ ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. మంగళవారం నాడు తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర క్రీడాశాఖపై చర్చ జరిగింది. ఇంకా ఈ క్రమంలో పీఎంకే పార్టీ చెందిన బామగకు చెందిన ధర్మపురి వెంకటేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ డిమాండ్ ను లేవనెత్తడం జరిగింది.చెన్నై సూపర్ కింగ్స్ టీంని నిషేధించాలని డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఉందని వెంకటేశ్వరన్ చెప్పారు.


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే తమిళనాడు టీంగా ప్రతిఒక్కరూ గుర్తిస్తారని, తమిళనాడు పేరు పెట్టుకున్న ఆ జట్టులో ఒక్క తమిళ ప్లేయర్ కూడా లేకపోవటం సిగ్గుచేటని, అందుకే ఆ టీంని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, తమిళనాడు పేరు చెప్పుకొని ఆడుతున్న జట్టులో తమిళ ప్లేయర్ ఒక్కరు లేకపోయినా కూడా అసలు క్రీడాశాఖ ఎందుకు స్పందించటం లేదని అసెంబ్లీ వేదికగా వెంకటేశ్వరన్ ప్రశ్నించారు. వెంటనే తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించాలని శాసనసభలో ఆయన పట్టుబట్టాడు.మన తమిళనాడులో క్రికెటర్లు లేరా? టాలెంట్ వున్న క్రీడాకారులు ఎవరూ కనిపించడం లేదా? అని వెంకటేశ్వరన్ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెన్నై టీంపై చర్యలు తీసుకోవాలని అలాగే ఆ టీం పై నిషేధం విధించాలని పీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడింది.అందులో రెండు మ్యాచ్ లు గెలిచి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఈ టీం ఐదో స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: