ఇక ఐపీఎల్‌-2023 లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక మ్యాచ్ కి రెడీ అయింది.వరుస విజయాలతో ఫుల్ స్పీడ్ గా దూసుకుపోతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం నాడు ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడనుంది. పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి ఈ మెగా ఈవెంట్‌లో మంచి బోణీ కొట్టిన హైదరాబాద్ టీం .. అదే జోరును కోల్కతాపై కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ టీం పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం తెలుస్తోంది.వరుసగా విఫలమవుతున్న ఇంగ్లండ్‌ పవర్‌ హిట్టర్‌ హ్యరీ బ్రూక్‌ను పక్కన పెట్టాలని ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ మెనెజ్‌మెంట్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. 13 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్న బ్రూక్‌ తన రేంజ్ కి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక ఈ ప్లేయర్ స్థానంలో న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ పిలిఫ్స్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్లేస్ లో అభిషేక్‌ శర్మ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో కూడా సుందర్‌ తన రేంజ్ కి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు.


ఇక ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లు ఇంకా ఒక స్పిన్నర్‌తో సన్‌రైజర్స్‌ బరిలోకి దిగే వైబ్స్ కన్పిస్తున్నాయి. అదే విధంగా రాహుల్‌ త్రిపాఠి ఇంకా కెప్టెన్‌ మార్‌క్రమ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చే అంశం.. ఇక బౌలింగ్‌ పరంగా కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ టీం పటిష్టంగా ఉంది.ఉమ్రాన్‌ మాలిక్‌, భువీ ఇంకా నటరాజన్‌ వంటి స్పీడ్‌ స్టార్లు ఉన్నారు. మరోవైపు కేకేఆర్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా బాగా బలంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గుర్భాజ్‌ ప్లేస్ లో జాసన్‌ రాయ్‌ జట్టులోకి రానున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక ఈడెన్ గార్డెన్స్‌ పిచ్‌ అయితే బ్యాటింగ్‌కు చాలా బాగా అనుకూలిస్తుంది. ఇదే స్టేడియంలో కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో భారీ స్కోర్‌ నమోదైంది. ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ వికెట్‌పై స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: