
దీంతో భారత కెప్టెన్సీ రేసులో అప్పటి వరకు ఎక్కడ వినిపించని హార్దిక్ పాండ్యా పేరు అందరికంటే ముందు వరుసలోకి వచ్చేసింది. అంతేకాదు రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా అటు హార్దిక్ పాండ్యా తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక గుజరాత్ జట్టును ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు హార్దిక్ పాండ్యా. ఇకపోతే ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. తాను మొదట లక్నో జట్టులో ఆడాలని అనుకున్నాను అంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ చెప్పుకొచ్చాడు.
లక్నో జట్టుకి కేఎల్ రాహుల్ కెప్టెన్ గా మారబోతున్నాడు అన్న విషయం తెలిసిన తర్వాత.. ఆ జట్టులో చేరాలని అనుకున్నాను. ఎందుకంటే నా గురించి తెలిసిన వ్యక్తితో ఆడాలని భావించాను. అయితే లక్నో ఫ్రాంచైజి నుంచి పిలుపు కూడా వచ్చింది. కానీ ఆశిష్ నెహ్ర ఫోన్ చేయడంతో తన మనసు మార్చుకుని.. ఇక గుజరాత్ జట్టులోకి వచ్చాను. ఆ తర్వాత సారధిగా బాధ్యతలు కూడా చేపట్టాను అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. మీరు లేకపోతే ఆ జట్టులో చేరడానికి ఒప్పుకునే వాడిని కాదు అని చెప్పాను అంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు.