ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతుండగా అటు యువ క్రికెటర్లతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఐపిఎల్ హిస్టరీలో అత్యుత్తమమైన ప్లేయర్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ సైతం ఇటీవల ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. సాధారణంగా రోహిత్ శర్మను అభిమానులు అందరూ కూడా హిట్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం అతను బ్యాటింగ్తో సృష్టించే విధ్వంసమే. అంతే కాదు మరి కొంతమంది అభిమానులు రోహిత్ శర్మను సిక్సర్ల వీరుడు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 రోహిత్ శర్మ ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే చాలు అతని బ్యాట్ నుంచి భారీ సిక్సర్లు వస్తూ ఉంటాయి. ఎంతో అలవోకగా సిక్సర్లు కొట్టడంలో రోహిత్ శర్మ దిట్ట అని చెప్పాలి. అయితే ఇలా సిక్సర్లు కొట్టడం విషయంలో కూడా ఇప్పటివరకు రోహిత్ శర్మ ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు. అయితే ఇటీవల ipl లో భాగంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ సిక్సర్లు కొట్టడం విషయంలో ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అన్నది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ మూడు సిక్సర్లు కొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ లో 250 సిక్సర్లు కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్గా ఘనత సృష్టించాడు రోహిత్ శర్మ.  ఇక ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 357 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.  ఇక ఆ తర్వాత స్థానంలో దివిలియర్స్ 251, రోహిత్ శర్మ 250, మహేంద్రసింగ్ ధోని 235, విరాట్ కోహ్లీ 229 తర్వాత స్థానాల్లో ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: