
దాదాపు గత రెండేళ్ల నుంచి కూడా టీమ్ ఇండియా సెలెక్టరు జట్టు ఎంపిక విషయంలో అతన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే మొన్నటి వరకు కనీసం ఐపీఎల్లో అయినా పృథ్వి షా మంచి ప్రదర్శన చేశాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్ లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగుతూ.. ప్రతి మ్యాచ్ లో కూడా నిరాశ పరుస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. అయినప్పటికీ అతనికి ప్రతి మ్యాచ్లో తుది జట్టులో చోటు తగ్గుతుంది. అతన్ని పక్కన పెట్టి మరొకరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఎంతో మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా పృథ్వి షాపై విమర్శలు వస్తున్న వేళ రికీ పాంటింగ్ అతని వెనకేసుకొచ్చాడు. జట్టులో షా కంటే ఉత్తమంగా ఆడేవారు ఉన్నారు. అయితే విఫలమవుతున్న పృథ్వి త్వరలోనే గాడిలో పడతాడని ధీమా వ్యక్తం చేశాడు రికీ పాంటింగ్. ఒక్కసారి అతను క్రీజులో కుదురుకున్నాడు అంటే జట్టుకు విజయం అందించడం ఖాయం అంటూ తెలిపాడు అందుకే అలాంటి ఆటగాడికి మరిన్ని అవకాశాలు ఇస్తాం అంటూ తెలిపాడు.