
కానీ ఒక్క మ్యాచ్ లో కూడా అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేకపోయింది. ఇక ప్రస్తుతం వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరన కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఎలా మారింది అంటే తర్వాత మ్యాచ్లో వరసగా విజయాలు సాధించిన ఆ జట్టు అటు ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుందా లేదా అన్నది కూడా అనుమానమే అన్నట్లుగా మారిపోయింది. ముఖ్యంగా ఢిల్లీ జట్టు బ్యాటింగ్ విభాగమైతే పూర్తిగా విఫలం అవుతుంది.
అయితే అద్భుతంగా ఆడుతాడు అని నమ్మకం పెట్టుకొని జట్టులోకి తీసుకున్న ఢిల్లీ ఓపెనర్ ఫీల్ సాల్ట్ అయితే జట్టుకు భారంగా మారిపోతున్నాడు. ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు విజయం సాధించిన.. ఇక ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ వైఫల్యం మాత్రం రిపీట్ అయింది. తొలి బంతికే గోల్డెన్ డకౌట్ వెనుదిరిగాడు సాల్ట్. ఈ సీజన్లో ఇన్నింగ్స్ తొలి బంతికి గోల్డెన్ డకౌట్ అయిన మూడో ప్లేయర్ గా సాల్ట్ నిలిచాడు. అంతే కాదు ఇప్పటివరకు ఢిల్లీ జట్టు తరపున ఆడిన ఐదు మ్యాచ్ లలో మూడుసార్లు డక్ అవుట్ అయ్యాడు. దీన్ని బట్టి అతని ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.