
వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టేబుల్ టాపర్ గుజరాత్ పై గెలవడం ఏంటి.. అది అసాధ్యం అనుకున్నారు అందరూ. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించి గుజరాత్ కే షాక్ ఇచ్చింది ఢిల్లీ కాపిటల్స్. ఇక ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లోను ఇదే జోరును కొనసాగించింది అని చెప్పాలి. అయితే అటు ఢిల్లీ జట్టు గెలుస్తున్న.. జట్టులో ఓపెనర్గా బలిలోకి దిగుతున్న ఫిలిప్స్ సాల్ట్ మాత్రం వరుస వైఫల్యాన్ని కొనసాగించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఢిల్లీ జట్టు తరఫున అతను ఆడిన ఐదు మ్యాచ్లలో కూడా మూడుసార్లు డక్ అవుట్ గానే వెనుతిరిగాడు. దీంతో అతన్ని డక్ అవుట్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు ఢిల్లీ ఫ్యాన్స్. అయితే ఈ డక్ అవుట్ స్టార్ ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఏకంగా ఢిల్లీ ఓపెనర్ ఫిలిప్స్ సాల్ట్ 45 బంతుల్లోనే 87 పరుగులు చేసి.. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లు ఉండడం గమనార్హం. మరో ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్న అటు ఫిలిప్ సాల్ట్ మాత్రం ఒత్తిడికి గురికాకుండా మంచి ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి.