ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంటర్టైర్మెంట్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు అటు ఐపీఎల్ ముగిసిన తర్వాత జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ ఉండడం గమనార్హం. అయితే అటు ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు ఆస్ట్రేలియాతో తలబడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాదిలా రన్నరప్ తో సరిపెట్టుకోకుండా.. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలవాలని ఆశపడుతుంది టీమిండియా జట్టు.



 ఈ క్రమంలోనే అటు పటిష్టమైన జట్టును డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఎంపిక చేయడమే లక్ష్యంగా బీసీసీఐ ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే డబ్ల్యూటీసి ఫైనల్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. కానీ అందులోని కొంతమంది ఆటగాళ్లు గాయం బారినపడి ఇక జట్టుకు దూరమైన నేపథ్యంలో.. ఇక జట్టులో మార్పులు చేర్పులు చేస్తూ ఇటీవల టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఇక ఎన్నో రోజులుగా భారత జట్టుకు దూరమైన రహానేకు సైతం డబ్ల్యూటీసి ఫైనల్ టీం లో చోటు కల్పించింది.



 అయితే మరో టెస్ట్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహ  విషయంలో మాత్రం సెలెక్టర్లు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసి ఫైనల్ కోసం జట్టును ఎంపిక చేయడంలో టీమ్ ఇండియా సెలెక్టర్లు ఒక ట్రిక్ మిస్ అయ్యారు అంటూ కుంబ్లే వ్యాఖ్యానించాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ సాహను జట్టులోకి తీసుకోవాల్సింది. భారత్లోని బెస్ట్ వికెట్ కీపర్ లలో  అతను కూడా ఒకడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ తరపున కీపర్ గా బ్యాట్స్మెన్ గా కూడా రానిస్తున్నాడు. కానీ సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవట్లేదు అంటూ కుంబ్లే వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl