ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మాట్లో ఎలా అయితే సూర్య కుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్ చూపించి హవా నడిపించాడో.. ఇక ఇప్పుడు 2023 ఐపీఎల్ సీజన్లోనూ ఇదే రీతిలో బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగుతున్న సూర్య కుమార్ యాదవ్ వరుసగా రెండు మూడు మ్యాచ్లలో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కొన్ని మ్యాచ్లలో డక్ అవుట్ కూడా అయ్యాడు అని చెప్పాలి. అయితే సూర్య ఫామ్ లోకి రావాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. చివరికి ఇటీవల ఫామ్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ మరోసారి బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించడం మొదలుపెట్టారు.



 గత ఐదు మ్యాచ్లలో కూడా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు సూర్య కుమార్ యాదవ్.. ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే వీర విహారం చేశాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది అంటే అందులో సూర్య కుమార్ ఇన్నింగ్స్  కారణం అనడంలోనూ సందేహం లేదు. మైదానం అలువైపులా మిస్టర్ 360 డిగ్రీస్ లో ఆట తీరును కొనసాగిస్తున్న సూర్య కుమార్ కు ఎక్కడ బంతి వేయాలో తెలియక బౌలర్లు అందరూ కూడా ఒత్తిడిలో మునిగిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే భారీగా పరుగులు సమర్పించుకుంటూ చెత్త రికార్డులను మూటగట్టుకుంటున్నారు.


 కాగా 2023 ఐపీఎల్ లో సూర్య కుమార్ యాదవ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ గురించి టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ విధ్వంసాన్ని ఆపాలి అంటే అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతిని కొట్టకుండా బ్యాట్ ని పట్టుకోవాలి. లేదంటే పరుగులు చేయొద్దు అంటూ అతని కాళ్ళను పట్టుకోవాలి అంటూ జహీర్ ఖాన్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇటీవల ఒకస్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జహీర్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. అయితే జహీర్ ఖాన్ కామెంట్స్ పై స్పందిస్తున్న సూర్య అభిమానులు ముమ్మాటికి మీరు చెప్పింది నిజం అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: