ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్ లాగానే ఈ ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది అన్న విషయం తెలిసిందే. ధోని కెప్టెన్సీ లో బరిలోకి దిగిన చెన్నై జట్టు అటు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది. నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రియ శిష్యుడిగా కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా. కాగా చివరిగా చెన్నై ఢిల్లీ జట్టుతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో భాగంగా.. రవీంద్ర జడేజా తన బౌలింగ్లో ఎక్కడ ప్రభావం చూపలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీపై చెన్నై విజయం సాధించిన అనంతరం ప్లేయర్లందరూ కూడా డగ్ అవుట్ కు వెళ్తుండగా.. ధోని, రవీంద్ర జడేజా మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. ఇక వీరిద్దరూ ఏకంగా మైదానంలోనే గొడవపడ్డారు అంటూ వార్తలు కూడా తిరమీదికి వచ్చాయ్. అయితే జడేజా ఎక్కువ పరుగులు ఇవ్వడంతోనే ధోని ఇలా సీరియస్ అయ్యాడు అంటూ కొంతమంది అంటుంటే.. వేరే కారణం ఉందని మరి కొంతమంది అభిప్రాయపడ్డారు.
 ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కర్మ మళ్లీ తిరిగి వస్తుంది కానీ దానికి కొంత సమయం పడుతుంది అంటూ పోస్ట్ పెట్టాడు రవీంద్ర జడేజా. ఇది ధోనిని ఉద్దేశించే పెట్టాడు అంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే ధోని, రవీంద్ర జడేజా గొడవలోకి జెజడ్డు భార్య రివాబా కూడా ఎంట్రీ ఇచ్చింది. జడేజా పెట్టిన ట్విట్ పై స్పందిస్తూ నీ దారిలో నువ్వు వెళ్ళు అంటూ ఒక పోస్ట్ పెట్టింది రివాబా జడేజా. దీంతో ఇది కాస్త మరింత చర్చనీయాంశంగా  మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం జడేజా అతని భార్య పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: