
అయితే వరుసగా రెండోసారి 2023 ఐపీఎల్ సీజన్లో కూడా గుజరాత్ టైటాన్స్ జట్టు.. కప్పు గెలవబోతుందా అంటే మాత్రం ఇక గణాంకాలు చూస్తే అందరికీ అవును అనే భావన కలుగుతుంది. ఎందుకు అంటే గత ఏడాది ఎలా అయితే గుజరాత్ ప్రస్థానాన్ని కొనసాగించిందో.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ అదే రీతిలో కాపీ పేస్ట్ అన్నట్లుగా ప్రస్థానం కొనసాగించింది. గత ఏడాది లాగానే తమ ప్రస్థాన్నాన్ని తొలి మ్యాచ్లో విజయంతో ప్రారంభించింది గుజరాత్ టైటాన్స్. అంతే కాదు గత సీజన్లో 14 గ్రూప్ స్టేజి మ్యాచ్ లు ఆడిన గుజరాత్.. ప్రస్తుత సీజన్లోనూ అన్ని మ్యాచ్లు ఆడింది. గత సీజన్ లాగానే 10 విజయాలు సాధించింది నాలుగు అపజయాలు ఎదుర్కొంది. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
అయితే గుజరాత్ టైటాన్స్ ఘనంకాలు చెప్పుకోవడానికి చాలా సింపుల్ గానే ఉన్నప్పటికీ.. అటు ఈ గణాంకాలే ఇక ఇప్పుడు మళ్లీ ఆ జట్టుకు టైటిల్ తప్పకుండా గెలుస్తుంది అనే నమ్మకాన్ని ఇస్తున్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలో ఎంట్రీ ఇచ్చిన రెండవ సీజన్లోనే ఒక అరుదైన రికార్డు సృష్టించింది గుజరాత్ టైటాన్స్ జట్టు. గ్రూప్ స్టేజి మ్యాచుల్లో వరుసగా రెండు సీజన్లలో ఐదు కంటే తక్కువ మ్యాచ్లు ఓడిన తొలి టీం గా హార్దిక్ పాండ్యా టీం చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.