2023 ఏడాదిలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్థానం అమాంతం ఆసక్తికరంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది పేలవ ప్రదర్శన చేసి నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్.. ఈసారి మాత్రం టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.  జట్టులో పలు మార్పులు చేర్పులు కూడా జరిగాయి అని చెప్పాలి. అయితే ఐపీఎల్ ప్రారంభం సమయంలో వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ జట్టు ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పంచుకుంది.. వరుస విజయాలతో చివరికి ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది.



 ఇటీవల జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో పటిష్టమైన లక్నో జట్టును 81 పరుగులు తేడాతో ఓడించి చివరికి రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే రెండవ క్వాలిఫైయర్ లో గుజరాత్ టైటాన్స్ తో నేడు తలబడబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒకవేళ ముంబై ఇండియన్స్ గెలిస్తే మాత్రం ఐపీఎల్ హిస్టరీలో ఏ టీం కి సాధ్యం కాని రీతిలో చరిత్ర సృష్టించబోతుంది అని చెప్పాలి. ఆరు ఫైనల్ ఆడి 5 టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ టైటిల్ నెగ్గిన అది చరిత్ర అవుతుంది. కానీ ఈసారి టైటిల్ విషయంలో కాదు మరో విషయంలో రోహిత్ సేన రికార్డు సృష్టించబోతుంది.



 ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఇప్పటివరకు ప్లే ఆఫ్ లో చేరిన నాలుగో జట్టు టైటిల్ నెగ్గిన దాఖలాలు లేవు. ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన మొదటి జట్టు మూడుసార్లు.. రెండో జట్టు ఏడు సార్లు.. మూడో జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ సాధించాయి. కానీ ప్లే ఆఫ్ అర్హత సాధించిన నాలుగో జట్టు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఒకవేళ ముంబై ఇండియన్స్ రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో విజయం సాధించి చెన్నై తో జరిగే ఫైనల్ పోరులో విజయం సాధిస్తే మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఒక అరుదైన చరిత్ర సృష్టించబోతోంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl