ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు అందరూ కూడా అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీ బిజీ కానున్నారు అని చెప్పాలి. మొదట ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే డబ్ల్యూటీసి ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా తో తలబడునున్నారు. అయితే ఇక ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్లతో వన్డే సిరీస్లో ఆడబోతుంది టీమిండియా.  స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల  సిరీస్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే . ఈఏడాది భారత్ వేదిక వన్డే వరల్డ్ కప్ ఉంది.


 ఇక వరల్డ్ కప్ కి ముందు ఈ వన్డే సిరీస్ లు టీమ్ ఇండియాకు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పాలి. అయితే వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఇక ఈ వన్డే సిరీస్ లకు అటు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తుంది.  కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమిని ఈ సీరిస్ నుంచి తప్పించాలని బిసిసిఐ సెలెక్టర్లు భావిస్తున్నారట. జూలై 12 నుంచి ఆగస్టు 13 వరకు వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టులు మూడు వన్డేలు ఐదు టి20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తర్వాత ఐర్లాండ్ లో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ కూడా ఉంది. అటు వెంటనే ఆసియా కప్ కూడా ఉంది.


 ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కి మధ్యలో ఆస్ట్రేలియా తో స్వదేశంలోనే సిరీస్ ఆడాల్సి ఉంది టీమ్ ఇండియా. ఇలా బిజీ షెడ్యూల్ కారణంగా వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడమే మేలని బీసీసీఐ భావిస్తుందట. ఈ క్రమంలోనే కెప్టెన్ గా రోహిత్ శర్మకు విశ్రాంతి నేపథ్యంలో ఇక హార్దిక్ కే సారధ్య బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉందట. అయితే కేఎల్ రాహుల్ గాయం బారిన పడి జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో.. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం ఖాయమని అర్థమైపోయింది. ఇక ఇటీవల ipl లో రాణించిన కొంతమంది యంగ్ ప్లేయర్స్ కి అటు జట్టులో చోటు కల్పించాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: