2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం ఏడున్నర గంటలకు జరగాల్సి ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇక ఈ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ ఉంది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో ఇక ఈ మ్యాచ్ జరగలేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇక రిజర్వుడే రోజు మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశం ఉండటంతో ఇక నేడు అదే సమయానికి అదే స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అయితే నిన్న మ్యాచ్ వీక్షించడానికి ఎంతో ఆసక్తిగా స్టేడియం కు చేరుకున్న అభిమానులందరికీ కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో నిరాశ ఎదురయింది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇక నేడు కూడా 60 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఇక నిన్న ఫైనల్ మ్యాచ్ జరగాల్సిన సమయంలో స్టేడియంలో ప్రేక్షకులు నిండిపోగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఏకంగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి పై ఒక మహిళ అభిమాని దారుణంగా దౌర్జన్యం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏదో విషయంపై సదరు మహిళా పోలీస్ అధికారితో వాదనకు దిగింది అన్నది తెలుస్తుంది. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీస్ అధికారిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత అతని కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా తన్నింది. అయితే సదురు పోలీస్ అధికారి మాత్రం ఆమెను ఏమీ అనకుండా అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడానికే ప్రయత్నించాడు. అయినప్పటికీ వినని మహిళ ఏకంగా పోలీసును కాలితో తన్నింది. దీంతోఆ పోలీస్ అధికారి మరోసారి కింద పడిపోయాడు. ఇక ఇదంతా అక్కడి కెమెరాలకు చిక్కింది. పక్కనే ఉన్న వాళ్ళు గొడవను చూస్తూ ఆనందిస్తున్నారే తప్ప ఒక్కరు కూడా అడ్డుకోలేదు. ఇక ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: