ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకుంది. దాదాపు గత 56 రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఈ లీగ్ ఇక నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ఇక ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిన్న జరగాల్సి ఉంది. కానీ నిన్న ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చివరికి ఇక మ్యాచ్ నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో రిజర్వ్డ్ డే అయినా నేడు ఇక ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే అప్పటికే గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ పై తీవ్రస్థాయిలో ఉత్కంఠ ఉంది. ఇక ఇప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ లేట్ కావడంతో ఆ ఉత్కంఠ ప్రేక్షకులు అందరిలో కూడా రెట్టింపు అయ్యింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత క్రికెట్లో గురు శిష్యులుగా ఉన్న ధోని, హార్దిక్ పాండ్యాలలో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. హార్థిక్ పాండ్యా గత ఏడాది గుజరాత్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు. కానీ మొదటి ప్రయత్నంలోనే టైటిల్ గెలిచాక ఇప్పుడు రెండో సీజన్లో అతనిపై భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.


 ఇలా అంచనాలను అందుకోవడానికి అతను మరింత కష్టపడాలి. అయితే ధోనిని ఆరాధించే చాలా మందిలో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు. తానే ఈ విషయాన్ని ఎన్నోసార్లు కూడా చెప్పాడు. అయితే మ్యాచ్ ఆరంభంలో టాస్ సమయంలో ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ స్నేహంగా కనిపిస్తారు. కానీ ఒక్కసారి మ్యాచ్ మొదలైన తర్వాత వాతావరణం మారిపోతుంది. హార్థిక్ పాండ్యా చెప్పినట్లు కెప్టెన్గా తానేం నేర్చుకున్నాడో వ్యూహాల రూపంలో అమలు చేయాల్సి ఉంటుంది అంటూ కామంటేటర్ టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. 2023 ఐపీఎల్ ఎక్కడ మొదలైందో అక్కడే ముగియనుంది అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: