సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కుర్రాళ్లలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఒక మంచి వేదిక అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి ఏడాది ఐపీఎల్ లో సీనియర్ ప్లేయర్లు బాగా రాణించిన రాణించకపోయినా అటు యంగ్ ప్లేయర్స్ మాత్రం ఎప్పుడు తమ ఆటతీరుతో సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకుని ఐపిఎల్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా పరుగుల ప్రవాహం పారిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే 2023 ఐపీఎల్ సీజన్లో కూడా ఇలా ఎంతోమంది కుర్రాళ్ళు తమ ఆటతీరుతో ఐపీఎల్ హీరోలుగా మారిపోయారు. ఇలా ఐపీఎల్లో ఒక్కసారిగా తెరమీదకి వచ్చిన ప్లేయర్స్ లో రింకు సింగ్ కూడా ఒకడు అని చెప్పాలి. ఈ రింకు సింగ్ టీమిండియాకు ఫ్యూచర్ ఫినిషర్ అని ప్రతి ఒక్కరు నమ్మే విధంగా అతని ఐపీఎల్ ప్రస్థానం కొనసాగింది. ముఖ్యంగా క్లిష్టమైన సమయంలో చివరి ఓవర్లలో అతను బ్యాటింగ్తో సృష్టించే విధ్వంసాన్ని చూసి నమ్మలేకపోతున్నారు ప్రేక్షకులు. మాజీ ప్లేయర్లు ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో ఓటమి ఖాయం అనుకున్న సమయంలో ఐదు సిక్సర్లు కొట్టి రింకు సింగ్ జట్టును గెలిపించిన ఇన్నింగ్స్ ని ఇప్పటికి ప్రేక్షకులు మరిచిపోలేదు.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్పందిస్తూ రింకు సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. యువరాజ్ సింగ్ ఓకే ఓవర్లో కొట్టిన ఆరు సిక్సర్ లని భారత క్రికెట్లో ఎప్పటికీ మరిచిపోలేదు. అలాగే రింకు సింగ్ కొట్టిన ఐదు సిక్సర్లను కూడా ఎవరూ మరిచిపోరు. అది ఒక గొప్ప ఇన్నింగ్స్... అతడు బెస్ట్ ఫినిషర్గా టీమిండియాలో చోటు దక్కించుకుంటాడు అంటూ సురేష్ రైనా ప్రశంసలు కురిపించాడు. అయితే రింకు సింగ్ ఆ ఒక్క మ్యాచ్ లోనే కాదు ఆ తర్వాత మ్యాచ్ లలో కూడా ఫినిషర్ పాత్రను పోషించి అటు కోల్కత్తా విజయంలో కీలక పాత్ర వహించాడు  అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl