భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా క్రికెటర్లను దేవుళ్ళు లాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇక భారత్లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు భారత జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ పాశ్చాత్య ఆటగా చెప్పుకునే క్రికెట్ నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇక ఆ మ్యాచ్ ని మిస్ చేయకుండా చూడటానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే భారత్లో క్రికెట్ కి ఉన్న ఈ క్రేజ్ కారణంగానే అటు బీసీసీఐ ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటుంది.



 అంతేకాదు భారత్లో క్రికెట్కు ఉన్న ఈ క్రేజే అటు బీసీసీఐని ప్రపంచ దేశాలలో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కూడా మార్చింది అని చెప్పాలి. అయితే ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది బీసీసీఐ. ఇక ఈ లీగ్ వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది. ఇక ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు కూడా ఈ లీగ్ లో భాగం కావడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇకపోతే 2023 ఐపీఎల్ సీజన్ 56 రోజులుగా ఎంటర్టైన్మెంట్ పంచి ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. అయితే ఐపీఎల్ మొదలైంది అంటే క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అటు బెట్టింగ్ మాఫియా కు పండగ వాతావరణం నెలకొంటుంది అని చెప్పాలి.


 పోలీసులు ఎంతల నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అటు బెట్టింగ్ మాఫియా మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. ఇక ఐపీఎల్ ఫైనల్ జరగబోతున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ళు జోరుగా బెట్టింగ్ పెడుతున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లపై పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఫైనల్ మ్యాచ్ కోసం ఎన్నో ప్రాంతాల్లో బార్లు భారీ ఎత్తున ఆఫర్స్ కూడా ప్రకటించాయ్ అని చెప్పాలి. బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి స్టేడియం ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక ఇలాంటి చోట్ల బెట్టింగ్స్ జరిగే అవకాశం ఉందని అనుమానంతో నిర్వాహకులకు  వార్నింగులు సైతం ఇస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl